KC Venugopal | జూన్ 3న సీఎంగా డీకే ప్రమాణస్వీకారం.. ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం
KC Venugopal | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారికంగా తేదీ ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎం (Karnataka CM) గా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) శనివారం సాయంత్రం ప్రకటించారు.
KC Venugopal : కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అధికారికంగా తేదీ ఖరారైంది. జూన్ 3న కర్ణాటక సీఎం (Karnataka CM) గా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) శనివారం సాయంత్రం అధిష్టానం తరఫున ప్రకటించారు. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నికైన అనంతరం మీడియాతో ఆ వివరాలను వేణుగోపాల్ పంచుకున్నారు.
సీఎల్పీ నేతగా డీకే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వేణుగోపాల్ చెప్పారు. డీకే పేరును కాంగ్రెస్ అధిష్టానం సూచించగా.. తొలుత సిద్ధరామయ్య, ఆ తర్వాత పరమేశ్వర ఆయన పేరును సీఎల్పీ సమావేశంలో ప్రతిపాదించారని తెలిపారు. దానికి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెస్ పార్టీకి సమస్య అవుతుందని అంతా భావించారని, అయితే తమదంతా ఒక కుటుంబమని, అంతా ఏకగ్రీవంగా ఈ ఎన్నికను ఆమోదించడం పార్టీకి గర్వకారణమని అన్నారు.
2028లోనూ నాయకులందరి సపోర్ట్తో కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అదికారంలోకి వస్తుందని కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో సిద్ధరామయ్య ఈనెల 28న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

