DK Shivakumar : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలోనే ఆగిపోయింది. బీజేపీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సొంతంగా సాధించలేకపోవడంతో తొలుత విపక్ష ఇండియా కూటమిలోనూ ఆశలు చిగురించాయి.
మరోవైపు ఎన్డీయే పక్షాల సహకారంతో నరేంద్ర మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. వేచిచూసే ధోరణితో వ్యవహరించాలని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఇటీవల జరిగిన విపక్ష ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో కూర్చోవాలని నిర్ణయం తీసుకుందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ఆయన ఆదివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల తరపున పోరాడతామని డీకే పేర్కొన్నారు.
ఇక రాష్ట్రపతి భవన్లో జరిగే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హాజరు కానున్నారు. విపక్ష కూటమి భాగస్వామ్య పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read More :
Health Tips | పొద్దున లేవగానే పరగడుపున ఎన్ని నీళ్లు తాగాలి?