Karnataka | బెంగళూరు : కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరు నీటి సరఫరా, సీవరేజ్ బోర్డు(బీడ్ల్యూస్ఎస్బీ) నగరంలో మంచినీటి చార్జీని లీటరుకు ఒక పైసా చొప్పున పెంచే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం శివకుమార్ బుధవారం వెల్లడించారు. ధరల పెరుగుదలపై బీజేపీ వ్యక్తం చేస్తున్న నిరసనలను ఆయన తప్పుపడుతూ ఇటీవల పాల ధరను పెంచి తమ ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చిందని ఆయన తెలిపారు. బీజేపీని రైతు వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు. వివిధ చార్జీలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది.