బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను నియమించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఒత్తిడి తెచ్చేందుకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో మొదటిసారి దీనిపై డీకే శివకుమార్ శుక్రవారం స్పందించారు.
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.