DK Shivakumar | బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
‘తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 15 ఏళ్ల టీనేజీ పిల్లలు కూడా ఉన్నారు. మృతుల్లో కనీసం 10 మందిని దగ్గరగా చూశా. ఈ బాధను తట్టుకోవడం ఏ కుటుంబం వల్లా కాదు. ఓ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండానే ఇవ్వాలని కోరారు. కానీ అది చట్టపరమైన ప్రక్రియ’ అంటూ డీకే కన్నీరు పెట్టుకున్నారు.
ఇక ఇదే సమావేశంలో నిన్న స్టేడియం వద్ద పరిస్థితి గురించి కూడా డీకే శివకుమార్ మాట్లాడారు. పరిస్థితి క్షణాల్లోనే చేయిదాటిపోయినట్లు చెప్పారు. ‘పోలీసు కమిషనర్ వెంటనే నన్ను సంప్రదించి జరిగిన విషయం చెప్పారు. అప్పటికే ఒకరిద్దరు చనిపోయారని చెప్పారు. కార్యక్రమాన్ని పది నిమిషాల్లో ముగించేయాలని ఆయన నన్ను కోరారు. అందుకే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేశాం’ అని డీకే వెల్లడించారు.
Also Read..
Harsh Goenka | దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా..? తొక్కిసలాట ఘటనపై హర్ష్ గోయెంకా పోస్ట్
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట.. మృతులు వీళ్లే..
Bengaluru Stampede | పోస్టుమార్టం పేరుతో నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి.. ఓ తండ్రి ఆవేదన