Rajnath Singh : పాకిస్థాన్ (Pakistan) కు రక్షణశాఖ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ (West Bengal) జోలికొస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతా (Kolkata) నూ లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఇటీవల కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాజ్‌నాథ్‌సింగ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలు అయ్యిందని 1971 నాటి స్థితిని గుర్తుచేశారు. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్.. పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అప్పటి బంగ్లా విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ రాజ్‌నాథ్ పాకిస్థాన్‌ను హెచ్చరించారు. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని ఇస్లామాబాద్‌కు సూచించారు.