లక్నో: పెంపుడు కుక్క చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతో అక్కాచెల్లెళ్లు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో ఫినాల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. (Two Sisters Die By Suicide) ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని దోడా ఖేడా జలాల్పూర్ ప్రాంతంలో 65 ఏళ్ల కైలాష్ సింగ్ కుటుంబం నివసిస్తున్నది. టోనీ అనే జర్మన్ షెపర్డ్ కుక్కను వారు పెంచుతున్నారు.
కాగా, ఆ పెంపుడు కుక్క నెల రోజులుగా అనారోగ్యంతో ఉన్నది. కైలాష్ సింగ్ కుమార్తెలైన 24 ఏళ్ల రాధా సింగ్, 22 ఏళ్ల జియా సింగ్ తీవ్రంగా మనస్తాపం చెందారు. డిసెంబర్ 24న ఉదయం తల్లి గులాబ్ దేవి కిరాణా సామాగ్రి కొనడానికి వారిద్దరిని బయటకు పంపింది. తిరిగి వచ్చిన తర్వాత తాము ఫినాల్ తాగినట్లు వారు చెప్పారు. ఆందోళన చెందిన గులాబ్ దేవి వెంటనే తన కుమారుడికి ఈ విషయం చెప్పింది. దీంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మెరుగైన చికిత్స కోసం మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. అక్కడకు తరలిస్తుండగా పెద్ద కుమార్తె రాధా సింగ్ మార్గమధ్యలో మరణించింది. ఆ ఆసుపత్రిలో అడ్మిట్ తర్వాత జియా సింగ్ కూడా చికిత్స పొందుతూ చనిపోయింది.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కాచెల్లెళ్ల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. గ్రాడ్యుయేట్లు అయిన వారిద్దరూ కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Train Hits Bike | బైక్ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి
India tests K-4 missile | జలాంతర్గామి నుంచి.. అణ్వాయుధ సామర్థ్యమున్న కే-4 క్షిపణి పరీక్ష
Christmas Decorations Vandalised | షాపింగ్ మాల్లో క్రిస్మస్ డెకరేషన్.. ధ్వంసం చేసిన దుండగులు