ముంబై, జూలై 18 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ 2026 పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదాలు సద్దుమణగడం లేదు. మే 3న జరిగిన మొదటి పరీక్షలో పేపర్ లీక్ కుంభకోణం తర్వాత, జూన్ 29న మళ్లీ పరీక్ష నిర్వహించారు. జూలై 16న ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాలు వెలుగు చూశాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా, వడవానికి చెందిన విద్యార్థిని జ్ఞానేశ్వరి అధికారిక అన్సర్ కీని తనిఖీ చేసుకోగా, 720 మారులకు గాను 702 మారులు సాధించి, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సీటు వస్తుందని కలలు కంది.
అయితే సోర్ కార్డులో 87 మారులను చూసి నివ్వెర పోయింది. సోహమ్ కథ కూడా ఇంతే.. బీడ్‌కు చెందిన సౌహమ్ నితిన్ గావతే ఆన్సర్ కీ ప్రకారం 522 మారులు వస్తున్నాయి. అయితే సోర్ కార్డ్‌లో కేవలం 95 మారులే ఉన్నాయి. ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.