న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీలో లుకలుకలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. లోక్సభలో ఆ పార్టీ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా చేశారు. ఆయన స్వయంగా విలేకర్లకు ఈ విషయాన్ని తెలిపారు. టీఎంసీ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్చువల్ సమావేశం నిర్వహించారని చెప్పారు.
పార్టీ ఎంపీల మధ్య సమన్వయం లేదని ఆమె అన్నారని తెలిపారు. ఈ నింద తనపైనేనని వాపోయారు. అందుకే తాను చీఫ్ విప్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మరోవైపు పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, కల్యాణ్బెనర్జీల మధ్య విభేదాలు మరింత ముదిరాయి.