చండీగఢ్, జూలై 3: పంజాబ్ కాంగ్రెస్లో తీవ్ర అసమ్మతి చిచ్చు రాజుకుంది.2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో చేపట్టిన సంస్థాగత నియామకాలు పార్టీలో అసమ్మతికి దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ రాజకీయ బలప్రదర్శనకు పూనుకున్నారు. చంకౌర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తన స్వస్థలం మోరిండా పట్టణంలోని తన నివాసంలో దాదాపు రెండు డజన్ల మంది మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో చన్నీ సమావేశమయ్యారు.
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజాను కొనసాగించాలన్న పార్టీ అధిష్ఠాన నిర్ణయంపై చన్నీ వర్గం లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్ఠానానికి ఒక వారం రోజుల వ్యవధిని ఇస్తున్నట్లు చన్నీ వర్గం ప్రకటించింది.