న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు జాతీయ గౌరవ చట్టానికి సవరణలు చేసి జాతీయ గీతానికి అమలు చేస్తున్న చట్టపరమైన రక్షణ నియమాలను జాతీయ గేయానికి కూడా అమలు చేయాలని యోచిస్తున్నది. సంబంధిత బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఆ బిల్లు చట్టమైతే జాతీయ గేయాన్ని అగౌరవపరచడం, దాని ఆలాపనకు భంగం కలిగించడం శిక్షార్హమైన నేరమవుతుంది. వందేమాతర గేయం రచించి 150 ఏండ్లయిన సందర్భంలోనే దానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించాలని మోదీ ప్రభుత్వం సంక్పలించడం గమనార్హం. నిరుడు డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయమై చర్చ కూడా జరిగింది