Malayalam Film Industry : మళయాళ సినీ పరిశ్రమలో ప్రముఖులపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పెనుదుమారం రేపుతోంది. ఈ వివాదంపై మళయాళ సినీ దర్శకుడు జోషి జోసెఫ్ స్పందించారు. బెంగాలీ నటి ఫిర్యాదు విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం తన ఇంటికి రాగా మూడు గంటల పాటు వారు తనతో మాట్లాడారని చెప్పారు. తొలి నుంచి జరిగిన ఘటనలన్నింటిపై తాను పూర్తి వివరాలను వారి ముందుంచానని తెలిపారు. తాను సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ఎదుట మరో వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు.
మళయాళ సినీ పరిశ్రమలో సంక్షోభం నెలకొందని ఆయన అంగీకరించారు. సినీ దర్శకుడు రంజిత్‌పై కొచ్చి పోలీసులకు బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఫిర్యాదు ఇచ్చేందుకు ఒక రోజు ముందు ఆయన కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2009లో తాను రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కే పలేరిమణిక్కం సినిమాలో తన పాత్ర గురించి చర్చించేందుకు తాను కొచ్చి వచ్చినప్పుడు జరిగిన ఘటనను ఈమెయిల్ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. చర్చ సందర్భంగా కొచ్చిలో రంజిత్ నివసించే ఫ్లాట్‌కు తనను పిలిపించారని తెలిపారు.
ఈ క్రమంలో తొలుత తన చేయి పట్టుకున్న రంజిత్ ఆపై దురుద్దేశంతో తన శరీర భాగాలను తడిమారని ఫిర్యాదులో నటి ప్రస్తావించారు. దీంతో ఫ్లాట్ నుంచి తాను బస చేసిన హోటల్‌కు తిరిగివచ్చానని తెలిపారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మరుసటి రోజు స్క్రిప్ట్ రైటర్ జోషి జోసెఫ్‌తో పంచుకున్నానని గుర్తుచేశారు. తనకు తిరుగు ప్రయాణ టికెట్ ఇవ్వనందున జోసెఫ్ సాయం కోరానని ఫిర్యాదులో నటి పేర్కొన్నారు.
Read More :
Kova Laxmi | ఎమ్మెల్యే కోవ లక్ష్మికి తీవ్ర అస్వస్థత.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు