(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బ్రిడ్జిలు పేకమేడల్లా కూలుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. గంభీరా బ్రిడ్జి కూలి 20 మంది మృతిచెందిన దుర్ఘటన మరిచిపోకముందే జునాజఢ్ జిల్లాలోని అజాజ్ గ్రామంలో మరో బ్రిడ్జి సోమవారం కూలిపోయింది.
దీంతో కార్మికులు సహా పలు వాహనాలు, సామగ్రి నదిలో పడిపోయాయి. బ్రిడ్జికి మరమ్మతులు చేపడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. బ్రిడ్జి కూలడంతో కెషోడ్ నుంచి మాదవ్పూర్ పట్టణాల మధ్య రాకపోకలు స్తంభించిపోయినట్టు పేర్కొన్నారు.