న్యూఢిల్లీ: మనదేశంలో 2022-24 మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు స్కామ్‌లు, సంబంధిత సైబర్ నేరాల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్రం తెలిపింది. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్ము 21 రెట్లు పెరిగి.. రూ.1,935 కోట్లకు చేరుకుందని కేంద్రం తాజాగా గణాంకాలు విడుదల చేసింది. బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రకారం, ఒక్క 2022 ఏడాదిలో 39,925 కేసులు నమోదుకాగా, రూ.91. 14 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. 2024నాటికి కేసుల సంఖ్య 1,23,672కు చేరుకుంది.