ముంబై: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బోయింగ్ 787, 737 విమానాల్లోని ఫ్యూయ ల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్‌ను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నెల 21లోగా ఈ తనిఖీలను పూర్తి చేసి, నివేదికను సమర్పించాలని చెప్పిం ది. బోయింగ్ 787, 737 విమానాలను ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ నడుపుతున్నాయి.
అహ్మదాబాద్‌లో కూలిన ఏఐ 171 విమానంలో కానీ, దాని ఇంజిన్లలో కానీ ఎటువంటి యాం త్రిక లేదా నిర్వహణపరమైన సమస్యలు లేవని ప్రాథమిక దర్యాప్తు వెల్లడించిందని ఎయిరిండియా సీఈఓ, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ సోమవారం చెప్పారు. తప్పనిసరిగా నిర్వహించవలసిన మెయింటెనెన్స్ పనులన్నీ పూర్తిగా జరిగాయన్నారు.
విమానం బయల్దేరడానికి ముందు పైలట్లు తప్పనిసరిగా బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో ఆమోదం పొందవలసి ఉంటుందని, ఈ పరీక్షల్లో కూడా వారు అనుమతి పొం దారని చెప్పారు. పైలట్ల మెడికల్ స్టేటస్‌కు సంబంధించిన వ్యాఖ్యలేవీ ఈ నివేదికలో లేవన్నారు.