Depression | న్యూఢిల్లీ, జూన్ 10: గర్భిణులు తమ ప్రె గ్నెన్సీ చివరి దశల్లో కుంగుబాటుకు గురయ్యే అవకాశం ఉన్నదో లేదో మొబైల్ యాప్ ద్వా రా అంచనా వేయొచ్చని పరిశోధకులు తెలిపారు. నిద్ర మంచిగా పడుతుందా? నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నారా? అభద్రతాభావం ఏమైనా ఉన్నదా? వంటి చిన్న ప్రశ్నలను గర్భిణులను అడిగి ప్రమాద కారకాలను పరిశోధకులు గుర్తించారు.
తాము గర్భిణులను చిన్న ప్రశ్నలు అడిగి వారు డిప్రెషన్లో ఉన్నారో లేదో తెలుసుకున్నామని, అవగాహన కల్పించామని అమెరికాలోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ తమర్ కృష్ణమూర్తి తెలిపారు.