న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నార్త్ ఇండియా వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాహనదారులైతే చాలా కష్టంగా డ్రైవ్ చేయాల్సి వస్తుంది.
ఢిల్లీ – ఖాట్మండు, ఢిల్లీ – జైపూర్, ఢిల్లీ – సిమ్లా, ఢిల్లీ – డెహ్రాడూన్, ఢిల్లీ – చండీఘర్ – కులూ మధ్య తిరగాల్సిన విమానాలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి. 50 డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 18 విమానాలు కూడా ఆలస్యంగా రానున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకు సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ వద్ద 7.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పాలం వద్ద 8.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉదయం 8:30 గంటల సమయంలో పాలం వద్ద 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 50 మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ కనిపించింది. సఫ్దర్జంగ్ వద్ద 6.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 200 మీటర్ల వరకు విజిబిలిటీ కనిపించింది. ఢిల్లీ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండటంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
Some flights (Delhi-Kathmandu, Delhi-Jaipur, Delhi-Shimla, Delhi-Dehradun, Delhi-Chandigarh-Kullu) are delayed due to fog and cold in the national capital.
Visuals from Delhi Airport. pic.twitter.com/pYkK4fXMmz
— ANI (@ANI) January 10, 2023