Supreme Court | భారతదేశంలో హిందుత్వ పరిరక్షణకు మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
ఈ పిటిషన్‌కు సంబంధించి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ కొందరు ఇస్లాంను రక్షించాలని, మరికొందరు క్రైస్తవాన్ని రక్షించాలని చెబుతారని పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో పాటు జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా సైతం ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘మీరు ఏదైనా చేసినా.. ఎవరూ అడ్డుకోరు. కానీ అందరూ చేయాలని చెప్పలేం’ అని పిటిషనర్‌కు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ.. పిటిషన్‌ను తిరస్కరించింది.