న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో వరుసగా నాలుగో రోజూ అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సఫ్దర్జంగ్లో 1.9 డిగ్రీలు, రిడ్జ్‌లో 2.2 డిగ్రీలు, ఆయా నగర్లో 2.6, లోధీ రోడ్లో 2.8, పాలమ్‌లో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. భారీగా మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. గాలి నాణ్యత 359 పాయింట్లకు పడిపోవడంతో వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్లింది.
Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY
— ANI (@ANI) January 8, 2023
పంజాబ్‌లోని అమృత్సర్, పటియాల, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో దృష్య గోచరత మందగించిందని అధికారులు వెల్లడించారు. బీహార్‌లోని గయా, భాగల్పూర్, లక్నో, గ్వాలియర్‌లో 200 మీటర్ల వరకు ముందున్న వాహనాలు కనిపించడం లేదని తెలిపారు.
Delhi | Fights were delayed due to severe fog & cold in the national capital. Visuals from Delhi Airport.
Visibility is very low at the airport amid the severe cold that we all have been experiencing, say passengers at Delhi airport pic.twitter.com/YnHO7TcXkF
— ANI (@ANI) January 8, 2023
ఇక పొగమంచు కమ్మేయడంతో విమానాలు, రైళ్ల రాకపోకలపై త్రీవ ప్రభావం చూపుతున్నది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది.
Delhi | Thick layer of fog covers the national capital this morning lowering visibility. Visuals from near Akshardham. pic.twitter.com/GUkdY7jTCx
— ANI (@ANI) January 8, 2023
42 trains running late in the Northern Railway region due to fog: Northern Railways pic.twitter.com/MhMxt8gJmo
— ANI (@ANI) January 8, 2023