న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రథమార్థంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్.. పంజాబీలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ ప్రజలు తీవ్ర కరెంటు కొరతను ఎదుర్కొంటున్నారని, ఆప్ అధికారంలోకి వస్తే ఆ కొరతను తీరుస్తామని చెబుతున్నారు. అంతేగాక 300 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ప్రతి ఇంటికి ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించారు.
కానీ, స్వయంగా తానే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఢిల్లీలో తాగునీటి కటకటపై మాత్రం కేజ్రివాల్ స్పందించడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ శివారు గ్రామాల ప్రజలకు ప్రతిరోజు మంచి నీటి ట్యాంకర్ కోసం పడిగాపులు తప్పడంలేదు. తీరా ట్యాంకర్ వచ్చిన తర్వాత తమ వంతు కోసం భారీ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో కరెంటు కొరత తీరుస్తానని హామీలు గుప్పిస్తున్న కేజ్రివాల్.. ముందుగా ఢిల్లీలో నీటి కొరతపై దృష్టి పెడితే మంచిదని బాధితులు కోరుతున్నారు.
Delhi | Residents of Chilla village queued up near a water tanker while waiting for their turns to get water. pic.twitter.com/hDqos9Nfjj
— ANI (@ANI) July 4, 2021
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో