Delhi Rains : ఢిల్లీలో భారీ వర్షం ప్రభావం విమాన సర్వీస్(Flight Operations)లపై పడింది. మంగళవారం సాయంత్రం నుంచి వాన జోరుగా పడడంతో 15 విమానాలను దారి మల్లించారు విమానాశ్రయం అధికారులు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున ఢిల్లీకి సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వీటిని మల్లించినట్టు వారు చెప్పారు. ఎనిమిది ఫ్లైట్స్‌ను జైపూర్‌కు, ఐదింటిని లక్నోకు, మరో రెండింటిని ఛండీగఢ్‌కు మల్లించినట్టు అధికారులు వెల్లడించారు.
‘ఢిల్లీలో నెలకొన్న ప్రతికూల వాతావరణం ప్రభావం విమాన సర్వీస్‌లపై తీవ్రంగా పడింది. దాదాపు 15 విమానాలను దారి మల్లించాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వడకుండా మా సిబ్బంది నిరంతరం చూసుకుంటున్నారు’ అని ఎక్స్ వేదికగా ఢిల్లీ విమానాశ్రయం అధికారులు పోస్ట్ పెట్టారు.
Delhi Airport (@DelhiAirport) posts, “Passenger Advisory issued at 16:28 Hours.” pic.twitter.com/Dzo45cVoun
— Press Trust of India (@PTI_News) October 7, 2025
మంగళవారం సాయంత్రం ఢిల్లీలో కుండపోతగా వర్షం పడింది. దాంతో, అప్రమత్తమైన విమానాశ్రయం అధికారులు విమానాలను దారి మల్లించారు. ఢిల్లీలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య భాగం, పశ్చిమ ప్రాంతంలో పాటు ఉత్తర ఢిల్లీ, వాయువ్య ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెప్పింది. అంతేకాదు పశ్చిమ, దక్షిణ ఢిల్లీకి ఎల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. లక్నోలోని వాతావరణ శాఖ సైతం నోయిడా, ఘజియాబాద్‌లకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది.