హైదరాబాద్, ఫిబ్రవరి 16: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను గుండె ముక్కలయ్యే విషాదంగా పేర్కొన్న ఆయన.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రం గా బాధించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదంపై మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎవరూ ఊహించలేని విషాదమని,పిల్లలతోసహా 18 మంది ప్రాణాలు కోల్పోవడం అత్య ంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎంఎల్సీ కే కవిత కూడా సంతాపం ప్రకటించారు. ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఘటనపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విచారం వ్యక్తం చేశారు.