న్యూఢిల్లీ : మేధావులు ఉగ్రవాదులైతే, క్షేత్ర స్థాయిలో పని చేసేవారి కన్నా ఎక్కువ ప్రమాదకారులవుతారని ఢిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిలు దరఖాస్తులపై విచారణ సందర్భంగా ఇటీవలి సంఘటనలను వివరించారు.
పోలీసుల తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ ఈ నెల 10న ఎర్ర కోట వద్ద ఆత్మాహుతి దాడి, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ను పట్టుకోవడం గురించి వివరించారు.