న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణ సరుకులు, కూరగాయలు వంటి అత్యవసర సేవలు మినహా ఇతర షాపులన్నీ మూతపడ్డాయి. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో కేజ్రివాల్ ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ విధించింది.
శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. పేరుకు వీకెండ్ కర్ఫ్యూ అయినా ఆంక్షలు లాక్‌డౌన్‌ను తలపిస్తున్నాయి. రోడ్లపై పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 19 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో 141 మంది మృతి చెందారు.
వీకెండ్ కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకు వస్తే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లేనని, వారిని అరెస్టు చేయడంతోపాటు కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు ముందే హెచ్చరించారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని, ఇతర సమయాల్లో ఎవరూ బయటకు రావద్దని సూచించారు. వీకెండ్ లాక్డౌన్ సందర్భంగా కార్యాలయాలు, రెస్టారెంట్లు, మెట్రో మాల్స్, ఆడిటోరియం తదితర వాటిని మూసివేశారు.
Delhi: Police check vehicular movement during ongoing Covid-induced weekend lockdown in the national capital.
— ANI (@ANI) April 18, 2021
Visuals from Connaught Place. pic.twitter.com/sxDCVxIkNJ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో