న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులు అంతర్జాతీయ అక్రమ ఆయుధాల రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు. చైనా, టర్కీలలో తయారైన అత్యాధునిక తుపాకులను పాకిస్థాన్ నుంచి భారత దేశానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఈ స్మగ్లర్లు డ్రోన్ల ద్వారా వీటిని పంపిస్తున్నారు.
ఈ ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు పంజాబ్‌కు చెందిన మన్దీప్, ఇద్దరు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహన్, మోను. వీరి నుంచి 10 ఖరీదైన విదేశీ తుపాకులను, 92 లైవ్ కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.