Kerala Blast | కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయగా.. చాలా మంది గాయాలకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళలో వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయిలో భద్రతను పెంచారు. ఢిల్లీలో పోలీసులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. పండుగ సీజన్, క్రికెట్ మ్యాచులను దృష్టిలో పెట్టుకున్న పేలుళ్లను సీరియస్‌గా హైఅలెర్ట్‌ను ప్రకటించి భద్రతను పెంచారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య అనధికారిక యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ యుద్ధం నేపథ్యంలో ముంబయిలోని యూదుల కేంద్రమైన చాబాద్ హౌస్ వద్ద ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిఘా సంస్థలతో ఎప్పటికప్పుడు చట్‌లో ఉందని.. ఇన్‌ఫుట్స్‌ను సీరియస్‌గా తీసుకొని రద్దీ ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. కేరళలోని కలమస్సేరి సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. మూడురోజులుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం చివరి రోజు కావడంతో దాదాపు రెండువేల మందికిపైగా ప్రార్థనలకు హాజరయ్యారు.
కార్యక్రమం ముగిసే సమయంలో కన్వెన్షర్ సెంటర్లో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 36 మంది వరకు గాయపడ్డారు. అయితే, పేలుడుకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వరుస పేలుళ్ల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్ఐఏతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌తో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు.