Delhi Excise Policy Case | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 30 వరకు కస్టడీని పొడిగించి. నేటితో కస్టడీ ముగియడంతో పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సిసోడియా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. సిసోడియాను ఈడీ అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ మళ్లీ అదే రోజున జరుగనున్నది. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సిసోడియాపై ఉన్న అభియోగాలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.
చార్జి ఫ్రేమింగ్పై విచారణ ప్రారంభించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ 24న జరుపనున్నది. సీబీఐకి సంబంధించిన కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నె 7న కోర్టు కస్టడీని 15 వరకు కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీలు.. ఇందులో ప్రధాన కుట్రదారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపించింది. ఇందులో చాలామంది ఆప్ నేతల ప్రమేయం ఉందని పేర్కొంది. అయితే, ఆరోపణలు నిరాధారమని ఆప్ పార్టీ పేర్కొంది. మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న ఈడీ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. నాటి నుంచి తీహార్ జైలులోనే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.