న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో 126.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని.. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భవనం పైకప్పు కూలి 58 ఏండ్ల వ్యక్తి చనిపోయాడు. మరోవైపు వర్షాల కారణంగా రాజస్థాన్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర భారతంలో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా తెలిపింది. కొద్ది గంటల్లో హర్యానాలో 80 మి.మీ వర్షం కురిసింది. రాజస్థాన్ నైరుతి ప్రాంతంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. కేరళలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.