న్యూఢిల్లీ : ఓ మహిళ హత్య కేసులో బీహార్ ఎమ్మెల్యేకు నాలుగేండ్ల జైలుశిక్ష రూ.25 లక్షల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నె ఇరుపక్షాల వాదనలు విన్నాక ఈ తీర్పు ఇచ్చారు. బీహార్ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ 2018 న్యూ ఇయర్ వేడుకల్లో.. గాల్లోకి కాల్పులు జరిపారు.
ఓ బుల్లెట్ రాజు సింగ్ ఎదురుగా ఉన్న ఓ మహిళ శరీరంలోకి దూసుకెళ్లి ఆమె చనిపోయింది. ఆమె భర్త వికాస్ గుప్తా పిటిషన్ వేయగా.. 2019లో రాజు సింగ్ రెండు నెలలు జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు.