ఎన్నికల ప్రచారాల్లో మాస్కులు తప్పనిసరి.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ విచారణ జరిపారు. ఉత్తర ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఈ నెల 30న తదుపరి విచారణ జరగనుంది. కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తున్న ప్రచారకులను డీబార్ చేయాలని పిటిషన్లో విక్రమ్ సింగ్ కోరారు. ఎన్నికల ప్రచారాల్లో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ఎన్నికల సంఘం డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని కూడా ఆయన కోరారు. మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారాలను మాత్రం ఎందుకు మినహాయించాలని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తరఫున నోటీసులను స్టాండింగ్ కౌన్సెల్ అనురాగ్ అహ్లూవాలియా స్వీకరించారు.
ఇవి కూడా చదవండి..
మధ్యప్రదేశ్‌లో 60 గంటల పాటు లాక్డౌన్
గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మళ్లీ దర్యాప్తు చేపట్టండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

