గంటకు 140 కి.మీ. వేగం.. అందుకే టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం

లాస్ ఏంజిల్స్: రెండు నెలల కిందట గోల్ఫ్ స్టార్ టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలుసు కదా. ఈ ప్రమాదంలో అతడు తన కుడి కాలు విరగ్గొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికారులు కీలకమైన వివరాలను వెల్లడించారు. ఆ సమయంలో టైగర్‌వుడ్స్ గంటకు 87 మైళ్ల (140 కిలోమీటర్లు) వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదే స్పీడుతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. లాస్ ఏంజిల్స్‌లోని రాంచోస్ పాలోస్ వెర్డస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
నిజానికి ఆ ప్రాంతంలో గంటలకు 45 మైళ్ల వేగంతో వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉన్నా.. టైగర్‌వుడ్స్ మాత్రం అంతకు దాదాపు రెట్టింపు వేగంతో వెళ్లాడు. విచారణకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించడానికి వుడ్స్ అంగీకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వుడ్స్ ఉన్నట్లు కెప్టెన్ జేమ్స్ పవర్స్ చెప్పాడు.
అయితే పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నట్లు తేలినా.. అక్కడ పోలీసు అధికారులుగానీ, ప్రత్యక్ష సాక్షులుగానీ లేకపోవడంతో టైగర్‌వుడ్స్‌పై ఎలాంటి క్రిమినల్ కేసూ పెట్టడం లేదు. ఒకవేళ తీవ్ర గాయాలు, మరణం, లేదా మరో వ్యక్తి ఈ ప్రమాదంలో ఉండి ఉంటే.. దీనిపై విచారణ కొనసాగించే వాళ్లమని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ప్రమాదంలో వుడ్స్ కాలు విరగడంతో అతనికి సర్జరీ చేసి రాడ్ వేశారు. దీంతో గురువారం ప్రారంభం కానున్న మాస్టర్స్ టోర్నీకి టైగర్‌వుడ్స్ దూరమయ్యాడు.
ఇవి కూడా చదవండి..
మీ గొంతు విని కరోనా ఉందో లేదో చెప్పేసే యాప్
యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలికి ఘోర అవమానం.. కనీసం కుర్చీ వేయకుండా..
రాధే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రిలీజ్ ఇప్పట్లో లేనట్లే అన్న సల్మాన్
ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడ వద్దు.. మహా సీఎంకు వాంఖడే నివాసితుల లేఖ
భారత్ ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం
కోవిడ్ మూలాల గురించి మళ్లీ దర్యాప్తు చేపట్టండి..
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
బంగ్లాదేశ్ టూర్‌కు ఆర్మీ చీఫ్
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
యూకేలో ‘ఆస్ట్రాజెనెకా’ వ్యాక్సిన్‌పై కీలక నిర్ణయం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

