న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులిచ్చింది. మద్యం పాలసీ కేసులో కోర్డు ప్రోసీడింగ్స్ను నిబంధనలకు విరుద్ధంగా రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఈడీ మార్చి 28న ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన అరెస్టు అక్రమమని వాదనలు వినిపించారు. సునీతతోపాటు సోషల్ మీడియా సంస్థలు ఎక్స్, మెటా, యూట్యూబ్లకు కూడా నోటీసులు జారీ చేసింది.