National Herald Case | సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..!
National Herald Case | కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది.
National Herald Case : కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది. ఈ కేసుకు సంబంధించి గతంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరించింది.
దాంతో ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతోపాటు ఈ కేసులోని ఇతరులకు నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతోపాటు ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు పొందిందని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

