న్యూఢిల్లీ : కోర్టు ఆదేశాల మేరకు గర్భస్రావం చేయించుకొనే రేప్ బాధితులను గుర్తింపు కార్డులు చూపాలని పట్టు పట్టొద్దని, దర్యాప్తు అధికారి ఆమెను గుర్తిస్తే సరిపోతుందని ఢిల్లీ హైకోర్టు దవాఖానలను ఆదేశించింది. ఈ విషయంలో ముఖ్యంగా మైనర్ల విషయంలో స్పష్టమైన, ఆచరణాత్మక, సున్నిత వైద్య నియమాలను పాటించాలని కోరింది.
గుర్తింపు పత్రాలు కావాలని పట్టు పట్టడం, వైద్య పరీక్షల నిర్వహణలో జాప్యం లాంటి కారణాల వల్ల బాధితురాలు మరింత దుఃఖానికి గురవుతారని ఓ రేప్ బాధితురాలి కేసు విచారణ సందర్భంగా గత నెల 29న కోర్టు వ్యాఖ్యానించింది. చట్టబద్ధ బాధ్యతలను నిర్వహించేటప్పుడు దయతో లైంగిక హింస బాధితుల సవాళ్లను అర్థం చేసుకొని వారికి వైద్యం చేయాలని కోర్టు సూచించింది.