Arun Pillai | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ కేసులో అరుణ్ పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతేడాది మార్చిలో అరెస్టు చేసింది. పిళ్లై ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించి, ఆ లంచాలను ఈ కేసులో ఇతర నిందితులకు అందించాడని ఆయనపై ఈడీ అభియోగాలను మోపింది. విచారణ సమయంలో పిళ్లై తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని, సాక్ష్యాధారాలను నాశనయం చేయడంలో ఆయన పాత్ర కూడా ఉందని ఈడీ ఆరోపించింది.