న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రస్తుతం నీటి ఎద్దడి(Water Crisis) ఉన్నది. దేశ రాజధానికి అధిక స్థాయిలో నీటిని రిలీజ్ చేయాలని హర్యానా కోరుతూ ఆ రాష్ట్ర సర్కారు ఇవాళ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. హీట్‌వేవ్ పరిస్థితుల వల్ల ఢిల్లీలో నీటి వినియోగం పెరిగిందని, అందుకే హర్యానా నుంచి మరింత నీటిని రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని హర్యానాను ఆదేశించాలంటూ ఢిల్లీ సర్కారు తన పిటీషన్లో కోరింది. ఒక నెల రోజుల పాటు అదనంగా నీటిని రిలీజ్ చేసేలా హర్యానాను ఆదేశించాలని తమ పిటీషన్లో వేడుకున్నారు. ఢిల్లీకి తాగు నీటిని అందించడం అందరి బాధ్యత అని ఆప్ ప్రభుత్వం పేర్కొన్నది. హర్యానా, యూపీలు ఢిల్లీకి నీరును రిలీజ్ చేసేలా ఆదేశించాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ బీజేపీని కోరారు. ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఉందని, హర్యానా తమ వాటా నీటిని రిలీజ్ చేయడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఆతిష్ ఆరోపించారు.