న్యూఢిల్లీ: అందరూ మహిళలే పనిచేసే బస్ డిపో దేశంలోనే తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సఖి డిపో పేరున ఏర్పాటు చేసిన సరోజినీనగర్ డిపోను రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ శనివారం ప్రారంభించారు. ఈ డిపోలో సుమారు 225 మంది సిబ్బంది అంతా మహిళలే ఉంటారు.
రవాణా రంగంలో మహిళా బస్డ్రైవర్లు, కండక్టర్లు తమ హక్కులు, అర్హతల సాధనలో వేసిన ముఖ్యమైన అడుగని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.