Attack On Delhi Family | ఢిల్లీ కుటుంబంపై గోవాలో కత్తులతో దాడి.. షాకింగ్ ఘటనగా పేర్కొన్న సీఎం
Attack On Delhi Family | గోవా స్థానికులు తమపై దాడి చేయడంపై బాధిత ఢిల్లీ కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రిసార్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పనాజీ: గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీ కుటుంబంపై అక్కడి స్థానికులు కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ( Attack On Delhi Family) ఈ సంఘటనలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. ఢిల్లీకి చెందిన 47 ఏళ్ల అశ్విని కుమార్ చంద్రాని తన కుటుంబ సభ్యులతో కలిసి మార్చి 5న గోవా వెళ్లారు. అంజునా ప్రాంతంలోని స్పాజియో లీజర్ రిసార్ట్‌లో వారు బస చేశారు. ఆ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే రాయిస్టన్ రెజినాల్డో డయాస్ అలియాస్ రోషన్‌తో స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో వారు మేనేజర్‌కు ఫిర్యాదు చేయగా రోషన్‌ను పని నుంచి తొలగించారు. ఈ సంఘటన నేపథ్యంలో రోషన్ తన అనుచరులను ఆ రిసార్ట్ వద్దకు పిలిపించాడు. దీంతో బ్యాట్లు, కత్తులు వంటి మారణాయుధాలతో వారు అక్కడకు వచ్చారు. అశ్విని కుమార్, అతడి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. కొందరిని కత్తులతో పొడిచారు. ఈ దాడిలో పలువురు స్వల్పంగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, గోవా స్థానికులు తమపై దాడి చేయడంపై బాధిత ఢిల్లీ కుటుంబం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారు పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రిసార్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ దీనిపై స్పందించారు. ఈ సంఘటన షాకింగ్ అని, సహించరానిదని అన్నారు. శాంతి భద్రతలకు ముప్పుగా మారిన సంఘ విద్రోహులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు గోవా పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. అంజునా ప్రాంత వాసులైన ప్రధాన నిందితుడు రోషన్, అతడి అనుచరులు నైరాన్ రెజినాల్డో డయాస్, జోసెఫ్ అలెక్స్ లోబో, కాశీనాథ్ విశ్వోర్ అగర్కడేకేను అరెస్ట్ చేశారు. దాడిలో పాల్గొన్న మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసు దర్యాప్తును మరో పోలీస్ అధికారికి అప్పగించినట్లు చెప్పారు. అలాగే కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అంజునా ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
https://twitter.com/Jacobmathewlive/status/1634967908475604994?s=20
Today’s violent incident in Anjuna is shocking and intolerable. I have directed the Police to take the harshest action against the perpetrators. Such anti-social elements are a threat to the peace and safety of the people in the State, and will be dealt with strictly.
— Dr. Pramod Sawant (@DrPramodPSawant) March 12, 2023
Congress protests | అదానీ వివాదంపై.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసన
OROP | ఓఆర్ఓపీ బకాయిలపై రక్షణ మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు చీవాట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

