Asiya Andrabi | కాశ్మీర్ వేర్పాటువాద నేత ఆసియా అంద్రాబీకి జీవిత ఖైదు.. ఉపా చట్టం కింద శిక్ష ఖరారు
Asiya Andrabi : కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు, దఖ్తరన్ ఇ మిల్లట్ సంస్థ చీఫ్ ఆసియా అంద్రాబీ అనే మహిళకు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అలాగే ఆమె అనుచరులైన సోఫి ఫెహ్మీదా, నహిదా నస్రీన్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Asiya Andrabi : కాశ్మీర్ వేర్పాటువాద నాయకురాలు, దఖ్తరన్ ఇ మిల్లట్ సంస్థ చీఫ్ ఆసియా అంద్రాబీ అనే మహిళకు ఢిల్లీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. అలాగే ఆమె అనుచరులైన సోఫి ఫెహ్మీదా, నహిదా నస్రీన్‌కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యూఏపీఏ/ఉపా) కింద ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో, అడిషనల్ సెషన్స్ జడ్జ్ చందర్ జిత్ సింగ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తాజా తీర్పు వెలువరించింది.
దేశం నుంచి జమ్మూ కాశ్మీర్‌ను విడగొట్టేందుకు కుట్రలు పన్నడం, దేశానికి వ్యతిరేకంగా పోరాడటం వంటి నేరాల కింద వీరికి కోర్టు ఈ శిక్ష విధించింది. ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలున్నట్లు తేలింది. నిందితులు దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్లు ఆరోపించింది. కొంతకాలంగా ఈ కేసుపై వాదనలు కొనసాగాయి. గత జనవరి 14న వీరిపై మోపిన నేరాల్ని కోర్టు గుర్తించింది. ఈ సందర్భంగా నిందితులు ముగ్గురికి కఠిన శిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడాలనుకునే మిగతావారికి ఈ శిక్ష ఒక సందేశం కావాలని ఎన్ఐఏ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. సెక్షన్ 20, 38, 39, 153 ఏ, 153బి, 120బి, 505, 121ఏ వంటి సెక్షన్ల కింద నిందితులకు కోర్టు తాజా శిక్ష ఖరారు చేసింది.
ఆసియా కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయడానికి వేర్పాటువాద ఉద్యమాన్ని నడిపించింది. ఒక మహిళా సంస్థ ద్వారా కాశ్మీర్‌ను పాకిస్తాన్లో కలపాలనే లక్ష్యంతో కుట్రలు చేసింది. అలాగే షరియా చట్టాన్ని సమర్ధించింది. గతంలో అనేక ఆరోపణలపై ఆసియాను చాలాసార్లు అరెస్టు చేశారు. చివరగా 2018లో ఎన్ఐఏ అరెస్టు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

