Amanatullah Khan | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ (MLA Amanatullah Khan)కు భారీ ఊరట దక్కింది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ లభించింది.
ఢిల్లీ వక్ఫ్ బోర్డు (Waqf Board case)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) బెయిల్ మంజూరు చేసింది (grants bail). అమనతుల్లా ఖాన్, ఇతరులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఎమ్మెల్యేను జైలు నుంచి విడుదల చేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఢిల్లీ వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అమనతుల్లా ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడు (2018-2022) చట్టవిరుద్ధంగా సిబ్బందిని నియమించారని, బోర్టు ఆస్తులను పారదర్శకత లేకుండా లీజుకు ఇచ్చారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ అధికారులు ఆయనను 13 గంటలపాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. రూ.15 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. కాగా, ఆయన జైలు విడుదల కాగానే మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.
సెప్టెంబర్ 2వ తేదీన అమనతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఈడీ.. అనంతరం ఆయన్ని అరెస్ట్ చేసింది. తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎమ్మెల్యే అస్పష్ట సమాధానాలు ఇవ్వడంతో అరెస్ట్ చేశామని ఈడీ పేర్కొంది. ఇప్పటికే ఆయనపై ఏసీబీ, సీబీఐ రెండు ఎఫ్ఐఆర్లను దాఖలు చేశాయి. చట్టవ్యతిరేకంగా ఇప్పటివరకు 32 మందిని నియమించారంటూ ఎఫ్ఐఆర్లో నమోదయింది. గతంలో కూడా అక్రమ నియామకాలకు పాల్పడ్డారని అనుమానిస్తూ అమనతుల్లాను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Sri Lanka | శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు.. బరిలో 8,821 మంది అభ్యర్థులు.. రేపే ఫలితాలు
Mumbai airport | ముంబై ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేసేందుకు కుట్ర.. బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన అధికారులు
Melania Trump | ఫస్ట్ లేడీగా మెలానియా ట్రంప్.. శ్వేత సౌధంలో మాత్రం ఉండకపోవచ్చు..!