న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌పై అవినీతి కేసును ఢిల్లీ కోర్టు సోమవారం మూసేసింది. ఆయనపై ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాలు దొరకలేదని సీబీఐ తెలపడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జైన్ పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో ఆ శాఖలో చట్టవిరుద్ధంగా కొందరు ప్రొఫెషనల్స్‌ను నియమించారని, ఈ ప్రక్రియలో అవినీతి జరిగిందని జైన్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో నిందితులు నేరం చేసినట్లు తెలిపే సాక్ష్యాధారాలను సీబీఐ సమర్పించలేదని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది. నేరపూరిత కుట్ర జరిగిందని చెప్పగలిగే అంశం ఏదీ లేదని తెలిపింది. తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.