న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా ఒక అధికారిక సమావేశానికి హాజరు కావడం రాజకీయ వివాదానికి దారి తీసింది. షాలిమార్ నియోజకవర్గ అభివృద్ధి ప్రాజెక్టులపై ఆదివారం రేఖా గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మనీష్ గుప్తా హాజరు కావడాన్ని ఆప్ ఢిల్లీ శాఖ ఇన్చార్జి సౌరభ్ భరద్వాజ్ రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు.
‘పంచాయత్’ వెబ్ సిరీస్లో సర్పంచ్ భర్త అనధికారికంగా అధికారాన్ని చలాయిం చడాన్ని ఉదహరించారు. బీజేపీ పాటిస్తున్న కుటుంబ రాజకీయాలను కూడా సౌరభ్ విమర్శించారు. రేఖా గుప్తా, ఆమె భర్త ఇద్దరిలో ఎవరు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ అడిగింది. అయితే అధికారిక సమావేశానికి మనీష్ గుప్తా సంఘ సేవకుడు,ప్రజల ప్రతినిధిగా హాజరయ్యాడని బీజేపీ తమ పార్టీ సీఎం చర్యను సమర్థించుకుంది.