న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల గెలుపు తర్వాత ఈ ఘనతను సొంతం చేసుకొన్నది. గురువారం గుజరాత్ ఫలితాలు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆప్ జాతీయ పార్టీగా అవతరించిందని ప్రకటించారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశంలో చాలా తక్కువ పార్టీలే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. ఆప్ 10 ఏండ్ల కిందట చిన్న పార్టీగా మొదలై ఢిల్లీ, పంజాబ్లో అధికారం చేపట్టింది. ఇప్పుడు గుజరాత్లో సీట్లు దక్కించుకొన్నది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.