ఈడీ సమన్ల నేపథ్యంలో బలనిరూపణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇద్దరు ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇద్దరు ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చారు. ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామని, బీజేపీతో చేతులు కలుపాలని కమలం పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్టు నాతో చెప్పారు. అంతేగాక.. త్వరలో కేజ్రీవాల్ అరెస్టు అవుతారని, ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు చెప్పినట్టు తెలిపారు.
అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను. మద్యం పాలసీ కేసు ఓ తప్పుడు కేసు. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నది’ అని పేర్కొన్నారు. అయితే విశ్వాస పరీక్షపై శనివారం చర్చ జరుగనుంది. ఇదే రోజు తన ముందు హాజరుకావాలని ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ను ఆదేశించింది. మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లకు స్పందించనందుకే ఈ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assembly
- BJP
- Delhi CM Kejriwal
- ED
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

