ప్రధాని డిగ్రీలు బయటపెట్టాల్సిందే
ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నదని శనివారం వ్యాఖ్యానించారు.
- అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్హత పత్రాలను బయటపెట్టాల్సిన అవసరం లేదన్న గుజరాత్ హైకోర్టు తీర్పును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నదని శనివారం వ్యాఖ్యానించారు. ‘ప్రధాని దేశానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రధాని విద్యావంతుడై ఉండటం చాలా ముఖ్యం.
గుజరాత్ వర్సిటీ ప్రధాని విద్యార్హతల పత్రాలను ఇవ్వకుండా నిరాకరించటానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మోదీ అహంకారమైనా కావాలి లేదా ఆయన డిగ్రీ నకిలీదైనా కావాలి’ అని అనుమానం వ్యక్తంచేశారు. మోదీ విద్యార్హతల పత్రాలను ఇవ్వాలని కేజ్రీవాల్ ఆర్టీఐ ద్వారా 2016లో దరఖాస్తు చేయగా, సమాచార కమిషన్ అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించటంతో సీఐసీ ఆదేశాలను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దరఖాస్తు చేసిన కేజ్రీవాల్‌కు రూ.25 వేల జరిమానా విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

