Farmers March | పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు, వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు (Farmers March) గత కొంతకాలంగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రైతులు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ ‘చలో ఢిల్లీ’ (Chalo Delhi) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు శంభు, ఖనౌరి సరిహద్దుల (Shambhu border) నుంచి రైతులు తమ మార్చ్‌ను ప్రారంభించనున్నారు. దీంతో ఇప్పటికే వేలాది మంది అన్నదాతలు సరిహద్దులకు చేరుకున్నారు.
#WATCH | Visuals from the Shambhu border, from where the farmers will start their march towards Delhi at 1 pm today. pic.twitter.com/xpNPLqBf0m
— ANI (@ANI) December 6, 2024
మరోవైపు రైతుల పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానా, పంజాబ్‌లు శంభు సరిహద్దుకు రెండు వైపులా భద్రతను మరింత పటిష్ఠం చేశాయి. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించే 163 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు. గురువారం హర్యానా పోలీసులు పంజాబ్ వైపు సరిహద్దులో అదనంగా మూడంచెలబారికేడ్లను ఏర్పాటు చేశారు.
#WATCH | Visuals from the Shambhu border, from where the farmers will start their march towards Delhi at 1 pm today. pic.twitter.com/N1dkpZGB0C
— ANI (@ANI) December 6, 2024
#WATCH | At the Shambhu border, Farmer leader Sarwan Singh Pandher says, “The central and state governments told the Supreme Court that they have a problem with farmers moving towards Delhi on tractors… A group of 100 farmers will move towards Delhi peacefully. We have no… pic.twitter.com/gbe8c9oXqo
— ANI (@ANI) December 6, 2024
#WATCH | Visuals from the Shambhu border, from where the farmers will start their march towards Delhi at 1 pm today. pic.twitter.com/DgWL8zWN9W
— ANI (@ANI) December 6, 2024
Also Read..
UGC | గతంలో చదివిన సబ్జెక్టులు ఏవైనా సరే.. నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు: యూజీసీ
Diamond Battery | ఈ బ్యాటరీ నిరంతరాయంగా 11 వేల ఏండ్లు పనిచేస్తుందట..!