Union Cabinet | హైదరాబాద్ : ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్రం కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా రెండు నిమిషాల పాటు కేంద్ర కేబినెట్ మౌనం పాటించింది. ఉగ్రవాదంపై పోరు కొసాగుతుందని స్పష్టం చేసింది కేబినెట్. దర్యాప్తు కొనసాగుతున్న తీరు, భద్రతా చర్యలను మోదీకి అమిత్ షా వివరించినట్లు సమాచారం. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.