న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో పటాసులపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్టు ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల పటాసులపై ఢిల్లీ తరహా నిషేధాన్ని అమల్లోకి తేవాలని హర్యానా, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నది. పూర్తిస్థాయిలో బ్యాన్ విధించలేమని సుప్రీంకు యూపీ తెలియజేసింది.