Delhi Pollution | ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం.. 309కి పెరిగిన గాలి నాణ్యత సూచీ..!
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతున్నది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో ఎన్సీఆర్లో గాలి నాణ్యత పడిపోయింది.
Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతున్నది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో ఎన్సీఆర్లో గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 322గా నమోదైందని సఫర్ తెలిపింది. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, హసన్పూర్ డిపో, తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారి పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఫలితంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు.
#WATCH | Overall air quality in Delhi deteriorates to ‘Very Poor’ category with the latest AQI at 306,
Visuals around Nehru Park and Teen Murti Marg. pic.twitter.com/1i1yWFS9rG
— ANI (@ANI) October 23, 2023
అలాగే నెహ్రూ పార్క్, తీన్‌మూర్తి మార్గ్ చుట్ట పక్కల ప్రాంతాల్లోను పొగమంచు కమ్మేసింది. ఇండియా గేట్, డ్యూటీ పత్‌లోనూ పొగమంచు పేరుకుపోయింది. మరో వైపు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం మధ్య పర్యావరశాఖ మంత్రి గోపాల్‌రాయ్ అధికారులతో తెలిపారు. దేశ రాజధానిలో చలి పెరుగుతోందని, గాలి వేగం తగ్గిందని పేర్కొన్నారు. ఢిల్లీలో రెండోగ్రాఫ్ అమలు చేసేందుకు అన్నిశాఖల అధికారులతో సోమవారం మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు.
#WATCH | Overall air quality in Delhi deteriorates to ‘Very Poor’ category with the latest AQI at 309.
Visuals around Anand Vihar, Hasanpur Depot, National Highway 9. pic.twitter.com/9H1SQwrib7
— ANI (@ANI) October 23, 2023
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి.. వరి కొయ్యలు, పొట్టు, వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇండియా గేట్ పలువురు మాట్లాడుతూ 10-12 నుంచి నుంచి ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందన్నారు. పొగదట్టంగా ఉందని.. పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. సైక్లిస్టులంతా మాస్క్‌లతోనే తిరుగుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే సైకిల్ తొక్కడం మానేసి ప్రత్యామ్నాయంగా వ్యాయామాలు చేస్తామని సైక్లిస్ట్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

