న్యూఢిల్లీ, ఆగస్టు 30 : నాలుగు ఇంజిన్ల సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో ఢిల్లీ కలాజీ ఆలయం లోపల సేవాదార్ను దారుణంగా హత్య చేశారని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
నాలుగు ఇంజిన్ల బీజేపీ సర్కార్ రాష్ర్టాన్ని ఆ పరిస్థితికి తేవడంతో ఇప్పుడు ఆలయాల్లో కూడా హత్యలు జరుగుతున్నాయన్నారు. అసలు ఢిల్లీలో ఎవరైనా భద్రతతో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. మాజీ సీఎం ఆతిశీ కూడా దాడిని ఖండించారు.